CM KCR reached Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కొంత మంది కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాసంగిలో పండిన పంట కొనుగోలు విషయమై కేంద్రంతో చర్చించేందుకు ఇవాళ సాయంత్రం బేగంపేట నుంచి ఢిల్లీ (CM KCR Delhi tour) బయల్దేరారు కేసీఆర్. ముఖ్యమంత్రితో పాటు, పలువురు కేబినెట్ మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు కూడా హస్తినకు చేరుకున్నారు.


పర్యటనకు ముఖ్య కారణాలు..


ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా నిరనలు చేపట్టించింది. వరి ధాన్యం ఎంతో కొంటుదనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఈ ధర్నాల్లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు అంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Also read: హుస్సేన్ సాగర్ చూసేందుకు వెళ్లి.. కనీసం 5 నిమిషాలు ఉండలేకపోయా : హైకోర్టు సీజే


మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను కలిసేందుకు చేపట్టిన కార్యక్రమం ఆందోళనలకు దారి తీసింది.


ఈ పరిణామాలన్నింటితో.. కేంద్రంతో నేరుగా తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ఇటీవలి ప్రెస్ కాన్ఫరెన్స్​లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఢిల్లీ వెళ్లారు.


ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (CM KCR to Meet PM Modi), మంత్రులు పీయుష్ గోయల్,  గజేంద్ర సింగ్‌ షెకావత్‌లను సీఎం కేసీఆర్ కలిసే అవకాశముంది. ఈ భేటీల్లో భాగంగా 3-4 రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.


ధాన్యం కొనగోలు సహా.. తెలంగాణ విభజన హామీలు, కృష్ణా జలాల వివాదంపై కీలక చర్చలు జరిపే అవకాశాలున్నాయి.


Also read: స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన కేసీఆర్‌, జగన్‌..


Also read: 'సీఎం కేసీఆర్​ దీక్ష పంజాబ్​ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా?'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook