హైదరాబాద్: రాజ్‌భవన్‌లో నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొందరు మంత్రుల శాఖల్లోనూ స్వల్ప మార్పులు చేశారు. హరీశ్ రావుకు ఊహించినట్టుగానే కీలకమైన ఆర్థికశాఖను కేటాయించగా.. కేటీఆర్‌కు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖలు కేటాయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరీశ్‌ రావు-ఆర్థికశాఖ
కేటీఆర్- ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు
సబితా ఇంద్రారెడ్డి-విద్యాశాఖ
పువ్వాడ అజయ్‌కుమార్-రవాణాశాఖ
గంగుల కమలాకర్- బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
సత్యవతి రాథోడ్-గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
జగదీష్‌రెడ్డి- విద్యుత్ శాఖ


కేబినెట్‌లో ఇతరులకు కేటాయించని సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతి భద్రతలు, నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్ శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరే ఉంచుకున్నారు.