Kcr vs Governer: కేసీఆర్ సర్కార్ వర్సెస్ రాజభవన్.. జాతీయ జెండాల పంపిణీలో పోటాపోటీ
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
Kcr vs Governer: తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య కొంత కాలంగా వార్ సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వానికి ధీటుగా సొంతగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజ్ భవన్ లోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కేసీఆర్ సర్కార్ , రాజ్ భవన్ మధ్య మరో విషయంలో పోటాపోటీ నెలకొంది. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 13,14,15 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. దీంతో ప్రతి ఇంటికి జెండాలు పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల నిర్వహణపై మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వజ్రోత్సవాల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయింంచారు. ఆగస్టు 15కు ముందు రోజు అన్ని జిల్లా, మండల కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై భారీ స్థాయిలో బాణసంచా పేల్చనున్నారు.రాష్ట్రంలోని మొత్తం కోటి 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జాతీయ జెండాల తయారీ పూర్తైందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. దీంతో ఈనెల 9 నుంచి జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణి చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. వజ్రోత్సవ వేడుకలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ వేడుకలను సీఎం కేసీఆర్ ఈనెల 8న హెచ్ఐసీసీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల కోసం ఎంపీ కేశవరావు చైర్మన్‌గా ఏర్పాటు చేసిన స్పెషల్ కమిటీ రూపొందించిన ప్లాన్, ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు. రాజ్‌భవన్ సిబ్బందికి ఆమె జాతీయ జెండాలు పంపిణి చేశారు. రాజ్ భవన్ లోని పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, గార్డెన్ లో పనిచేసే వారికి జాతీయ పతకాలతో పాటు కొత్త దుస్తులు కూడా ఇచ్చారు గవర్నర్ తమిళి సై. గవర్నర్ నుంచి జాతీయ జెండాలు, దుస్తులు తీసుకుంటూ భారత్ మాతా కీ జై అని నినదించారు రాజ్ భవన్ కార్మికులు. బుధవారం రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు గవర్నర్. యూనివర్శిటీలు, కాలేజీ విద్యార్థులతో భేటీ అవుతున్నారు. వాళ్ల సమస్యలు తెలుసుకోనున్నారు. కొన్ని రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైతో సమావేశం కానున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేసీఆర్ సర్కార్ కు పోటీగానే చేపడుతున్నానే టాక్ వస్తోంది.
Also Read: Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook