Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!

Rohit Sharma Ruled Out From Asia Cup 2022 after Injury. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఆసియా కప్‌ 2022 ఆడడం అనుమానంగా మారింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 3, 2022, 08:44 AM IST
  • ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ
  • రోహిత్ శర్మ ఔట్
  • 5 బంతుల్లో 11 పరుగులు
Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!

Rohit Sharma might be Ruled Out From Asia Cup 2022 : ఆసియా కప్‌ 2022కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఆసియా కప్‌ ఆడడం అనుమానంగా మారింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో గాయపడిన రోహిత్‌కు 3-4 వారాల విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది. దాంతో వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌తో పాటుగా కీలక ఆసియా కప్‌కు హిట్‌మ్యాన్ దూరం కానున్నాడట.

మూడో టీ20 ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌ చేయగా.. మొదటి బంతికి రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. రెండో బంతి డాట్ కాగా.. మూడో బంతికి ఫోర్ బాదాడు. ఇక నాలుగో బంతి అనంతరం అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. నొప్పితో అల్లాడిపోయాడు. లెగ్ సైడ్ స్వీప్ షాట్‌ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేశాయి. టీమిండియా ఫిజియో కమలేష్ జైన్‌ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దాంతో హిట్‌మ్యాన్ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచులో రోహిత్ 5 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆపై శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. 

రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది. 'టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం వెన్ను నొప్పి ఉంది. అతని పురోగతిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది' అని ట్వీట్ చేసింది. 'ప్రస్తుతానికి ఫర్వాలేదు. నాలుగో టీ20 మ్యాచుకు కొన్ని రోజుల సమయం ఉంది. అప్పటివరకు గాయం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి' అని రోహిత్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. నాలుగో టీ20 వరకు రోహిత్ గాయం తగ్గినా.. కీలక ఆసియా కప్‌ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అతడికి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హిట్‌మ్యాన్ గాయం పెద్దది అయితే 3-5 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. 

ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ట్విటర్‌ వేదికగా మంగళవారం ప్రకటించారు. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఆగస్ట్‌ 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్ పోరు ఆగస్ట్‌ 28న జరుగనుంది. ఆసియా కప్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ జట్లతో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ కూడా ఆడనుంది. సెప్టెంబరు 11న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. 

Also Read: Horoscope Today August 3rd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ ఊహించని స్థాయిలో ధనలాభం..  

Also Read: Komatireddy Rajagopal Reddy: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News