Aasara Pensions: వృద్దాప్య పింఛన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా గుడ్‌న్యూస్ అందించారు. ఇకపై వారందరికీ పింఛన్ ఇవ్వనున్నట్టు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో (Telangana) 2018లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి 57 నిండినవారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శుభవార్త విన్పించారు. ఇకపై 57 ఏళ్లు నిండినవారికి ఆసరా పింఛన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసింది. ప్రస్తుతం ఆమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆసరా పింఛన్లు 60 ఏళ్ల నిండినవారికే ఇస్తున్నారు.కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు 57 ఏళ్లు పైబడినవారికి ఆసరా పించన్ (Aasara Pensions) ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్థులు, నేత-గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు  2 వేల 116 రూపాయలు, దివ్యాంగులకు 3 వేల 116 రూపాయల పింఛన్ అందుతోంది. దీనికి సంబంధించి షరతులు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారుల పేరున 7.5 ఎకరాల మెట్టభూమి, మాగాణి అయితే 3 ఎకరాలు మించి ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 1.5 లక్షల రూపాయలు, నగరాల్లో 2 లక్షలు మించకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలుంటే పెన్షన్‌కు అనర్హులు. ఓటరుకార్డుపై సూచించే పుట్టిన తేదీ ఆధారంగా వయస్సు నిర్ధారణ ఉంటుంది. తెల్లరేషన్ కార్డు ఉంటేనే అర్హత ఉంటుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్రయోధుల పెన్షన్ పొందుతున్నవారు అనర్హులు.హెవీ వెహికల్స్ ఉన్నా సరే పెన్షన్ వర్తించదు. 


Also read: Telangana APP Recruitment 2022: గుడ్‌న్యూస్..తెలంగాణలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook