Telangana APP Recruitment 2022: గుడ్‌న్యూస్..తెలంగాణలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Telangana APP Recruitment 2022: సుదీర్ఘకాలం అనంతరం తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం జరగనుంది. రాష్ట్రంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు, అర్హతేంటి, వేతనం ఎలా ఉండనుందనే వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 5, 2021, 09:23 AM IST
 Telangana APP Recruitment 2022: గుడ్‌న్యూస్..తెలంగాణలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Telangana APP Recruitment 2022: సుదీర్ఘకాలం అనంతరం తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం జరగనుంది. రాష్ట్రంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు, అర్హతేంటి, వేతనం ఎలా ఉండనుందనే వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత ఉంది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయలేదు. ఇప్పుడు పెద్దఎత్తున ఆ పోస్టుల్ని భర్తీ చేసేందుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత విడుదలైన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం. మరోవైపు త్వరలో పోలీసు శాఖలోని 19 వేల పోస్టుల భర్తీకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఏపీపీ పోస్టులకు ( Assistan Public Prosecutors) దరఖాస్తు చేసేవారికి కావల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి.

మొత్తం 151 ఏపీపీ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్(APP Jobs Notification) వెలువడింది. జూలై 1, 2021 నాటికి 34 ఏళ్లు మించకుండా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ లేదా బీఎల్ లేదా ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉండాలి. జూలై 3 నాటికి కనీసం మూడేళ్లపాటు క్రియాశీలకంగా క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేటుగా పనిచేసుండాలి. తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధులకు 750 రూపాయలు ఫీజు కాగా..మిగిలినవారికి 15 వందల రూపాయలుగా ఉంది. ఇప్పటికే అభ్యర్ధుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీపీ పోస్టులకు వేతనం 54 వేల 220 రూపాయల్నించి 1 లక్షా 33 వేల 630 ఉంటుంది. ఎంపిక విధానం ఇతర వివరాలకు https://www.tslprb.in/ సంప్రదించాల్సి ఉంటుంది. 

ఏపీపీ నోటిఫికేషన్ కొత్త జోనల్ వ్యవస్థకు(New Zonal System) అనుగుణంగా ఉంది.మొత్తం 151 పోస్టుల్లో మల్టీజోన్ 1 పరిధిలో 68 పోస్టులుండగా..మల్టీజోన్ 2 పరిధిలో 83 పోస్టులున్నాయి. అన్ని పోస్టుల భర్తీలో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వుమెన్ రిజర్వేషన్లతో పాటు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్, వికలాంగుల రిజర్వేషన్‌లు పరిగణలో తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల మినహాయింపు ఇవ్వగా..వికలాంగులకు పదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఐదేళ్లు వయోపరిమితి, ఎక్స్‌సర్వీస్ మెన్‌లకు మూడేళ్ల మినహాయింపు ఉంది.

Also read: KCR Sircilla Tour: తనయుడు KTR నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News