Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మల్యాల మండలంలో జరిగిన మహాజన్ సంపర్క్ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్ తో కలిసి పాల్గొన్న సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు పెగ్గులు తాగిన మైకంలో ఇచ్చే హామీలు ఎప్పటికీ అమలుకు నోచుకోవు అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రానిదేనని అన్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఇప్పటికీ రైతులకు వడ్ల డబ్బులు చెల్లించలేదు అని మండిపడ్డారు. వ్యవసాయం చేద్దాం అంటే రైతు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిందని అప్పు తీసుకొద్దాం అంటే రైతులను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పోలీసులకు పరుగుల పోటీ పెట్టించడం కాదు.. త్వరలో తెలంగాణ వదిలి పరిగెత్తేందుకు నీవు, నీ కుటుంబం పరుగు నేర్చుకుంటే బాగుంటుంది అని కేసిఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 


కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఆస్తులు కూడబెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం అంటూ ఏమీ లేదని భారతదేశమే తన పరివారంగా భావించి ప్రజాసేవ చేస్తున్నాడని ప్రధాని మోదీని ప్రకాశ్ జవదేకర్ కొనియాడారు. కానీ కెసిఆర్ మాత్రం ప్రజలను వదిలిపెట్టి తన పరివారానికే పదవులు ఇచ్చి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడని, మోడీ ప్రజలకు వ్యాక్సిన్స్ ఇప్పిస్తే లు తీవ్రస్థాయిలో విమర్శించారు.  


ఇది చదవండి : Telangana Group1 Exams: మరోసారి అనుమానాస్పదంగా మారిన టిఎస్పీఎస్సీ వైఖరి


కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 40వేల కోట్లతో  తానే అనుమతి  ఇచ్చానని కానీ లక్ష   20 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారని మిగతా 80 వేల కోట్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. అంతకుముందు మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు బండి సంజయ్, ప్రకాష్ జయదేవకర్లు బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ మోర్ఛాల బాధ్యులతో బండి సంజయ్ కుమార్, ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బిజెపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షులు బింగి వేణు, మండల శాఖ అధ్యక్షులు నేరెళ్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


ఇది చదవండి : BRS MLA Durgam Chinnaiah: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK