CM Kcr: వరద బాధితులకు అండగా ఉంటాం..ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..!
CM Kcr: తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు.
CM Kcr: వర్షాలు, వరదలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలన్నీ నీటిమయం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలను తరలించారు. ఈక్రమంలోనే ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహంచారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన ప్రాంతాలు, జలమయమైన గ్రామాలు, నీటి చిక్కుకున్న ప్రదేశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. అనంతరం గోదావరి నదిలో శాంతి పూజలు చేశారు. భద్రాచలం వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత గోదావరి కట్ట వద్దకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.
Also read:Monkeypox: ఆంధ్రప్రదేశ్‌లోకి మంకీ పాక్స్ ఎంట్రీ..అప్రమత్తమైన ప్రభుత్వం..!
Also read:India vs England: మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..తుది జట్టు ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.