CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు మృతి!
CM KCR: సీఎం కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు(94) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.
CM KCR: సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు(94) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శనివారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని దేవి విహార్‌లోని తన సొంత ఇంట్లో ఆయన కన్నుమూశారు. కమలాకర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి కేసీఆర్ తన మేనమామ ఇంటికి వెళ్లేవారు. బాల్యంలో అనేక సార్లు ఇక్కడకు వచ్చానన్న ఆయన.. కామారెడ్డి గంజ్‌లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకున్నారు.
కమలాకర్ రావుకు (Guniganti Kamalakar Rao) ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పిల్లలందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. కమలాకర్ రావు పార్థివదేహాన్ని సందర్శకుల కోసం కామారెడ్డి దేవివిహార్ లో ఉంచారు. బంధువులతోపాటు పలువురు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం దేవునిపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా కమలాకర్ అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకావట్లేదు.
Also Read: తెలంగాణ పథకాలు తమిళనాడులో అమలు చేస్తాం: సీఎం స్టాలిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook