KCR MEETING :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస కార్యక్రమాలతో బిజీగా మారిపోయారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఫౌంహౌజ్ వెళ్లిపోయారు కేసీఆర్. దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీకి ప్లాన్ చేసిన కేసీఆర్.. ఢిల్లీ అడుగులపైనే పార్టీ ముఖ్య నేతలతో మంత్రాగం జరిపారని తెలుస్తోంది.  ఐదు రోజుల క్రితం ప్రగతి భవన్ కు వచ్చారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం యాదాద్రికి వెళ్లారు. శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. శనివావరం వరంగల్ లో పర్యటించారు. ములుగు రోడుల్లో కొత్తగా నిర్మించిన ప్రతిమి క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ, రాష్ట్ర రాజకీయలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణతో పాటు జై భారత్ అని నినదించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాననే సంకేతం ఇచ్చారు. ఆదివారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ పార్టీ ఏర్పాటుపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ జెండా, అజెండా ఖరారు చేసిన కేసీఆర్.. పార్టీ నేతలతో దీనిపై చర్చించి ఫైనల్ చేస్తారని భావిస్తున్నారు. విజయ దశమి రోజున చేయబోతున్న పార్టీ ప్రకటనపైనా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నాం, పార్టీ లక్ష్యం, భవిష్యత్ కార్యాచరణ వంటి అన్ని విషయాలను పార్టీ నేతలకు గులాబీ బాస్ వివరించనున్నారు. ఈ సమావేశంలో దసరా రోజున చేయబోయే ప్రకటనకు తుది రూపు ఇస్తారని సమాచారం. ఈనెల 4న సిద్దిపేట జిల్లా కోనాయపల్లికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.ఈ టెంపుల్ కేసీఆర్ కు మొదటి నుంచి సెంటిమెంట్. ఏదైనా ముఖ్యమైన కార్యం తలపెట్టినప్పుడు కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు కేసీఆర్. ఎన్నికల్లో నామినేషన్ పత్రాలకు మొదట ఇక్కడే పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితీ ఏర్పాటుకు ముందు కూడా కోనాయపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్.


ఈ నెల 5న దసరా రోజున జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జాతీయ పార్టీకి మద్దతుగా తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌పై కూడా కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. అన్ని సజావుగా సాగేందుకు న్యాయనిపుణుల సలహాలు కూడా  తీసుకున్నారని చెబుతున్నారు. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా  వివిధ కార్యక్రమాలకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. విజయదశమి రోజున  వివిధరాష్ట్రాలకు చెందిన రైతు, కార్మిక సంఘాల నేతలను  ప్రగతిభవన్‌లో లంచ్ కు ఆహ్వానించారని తెలుస్తోంది. ఈనెలలోనే జాతీయ పార్టీకి మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. ఈ సభ కూడా కరీంనగర్ లో ఉండవచ్చని తెలుస్తోంది.


మరోవైపు కేసీఆర్ వరుస పార్టీ సమావేశంలో మరో చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దసరా రోజున అసెంబ్లీ రద్దు చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దసరా రోజున జరిగే సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. జాతీయ పార్టీ ప్రకటనతో పాటు అసెంబ్లీ రద్దుపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారని అంటున్నారు.


READ ALSO : FOOTBALL FANS FIGHT: రక్తపాతంగా మారిన ఫ్యాన్స్ ఫైట్.. 129 మందిని బలి తీసుకున్న ఫుట్ బాల్ మ్యాచ్


READ ALSO : AP govt vs Harish Rao : మంత్రి హరీష్ రావుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి