AP govt vs Harish Rao : మంత్రి హరీష్ రావుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు

Minister Harish Rao: టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. ఈ బంధం ఇంతటితోనే ఆగకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై వచ్చే విమర్శలను సీపీఐ తిప్పికొట్టే వరకు వెళ్లినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు చూస్తే అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2022, 05:26 AM IST
AP govt vs Harish Rao : మంత్రి హరీష్ రావుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు

Minister Harish Rao: టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభలో భాగంగా సీఎం కేసీఆర్ తో కలిసి వేదిక పంచుకున్న లెఫ్ట్ నేతలు.. రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కి తమ మద్దతు ఉందని చెప్పకనే చెప్పేశారు. అయితే, ఈ బంధం ఇంతటితోనే ఆగకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై వచ్చే విమర్శలను తిప్పికొట్టే వరకు వెళ్లినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు చూస్తే అనిపిస్తోంది.

మంత్రి హరీశ్ రావుపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన రామకృష్ణ
ఇటీవల తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. అదే సమయంలో ఉదాహరణలా ప్రస్తావిస్తూ ఏపీలో పరిస్థితిని కూడా ప్రస్తావించారు. అయితే ఏపీలో ఉద్యోగుల సమస్యల గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడిన మాటలను తప్పుపడుతూ ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్పరాజు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు సైతం మంత్రి హరీశ్ రావు తీరును తప్పుపడుతూ ప్రత్యారోపణలకు దిగిన సంగతి కూడా తెలిసిందే. ఇదే విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ హరీశ్ రావును వెనకేసుకొచ్చారు.

మంత్రి హరీశ్ రావు మాటల్లో తప్పేం ఉందన్న రామకృష్ణ
ఏపీలో ఉద్యోగులు పడుతున్న సమస్యల గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని రామకృష్ణ వైసీపీ నేతలను నిలదీశారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై సైతం అక్కడి ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపి అణిచివేయలేదా అని అడిగారు. పిఆర్సి, సిపిఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిన మాట వాస్తవమా కాదా అని వైసీపీ నేతలకు వరుస ప్రశ్నలు సంధించారు.

Also Read : Ayyannapatrudu: 14 కేసులు పెట్టారు..ఏం చేశారు..సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు ఫైర్..!

Also Read : APPSC Group 1 Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News