KCR MEETING: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేశారు. పలు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి కీలక నేతలతో చర్చలు జరిపారు. దేశంలో సంచలనం జరగబోతుందని ఢిల్లీలో కామెంట్ చేసిన కేసీఆర్.. హైదరాబాద్ వచ్చాకా మళ్లీ సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన నుంచి రాజకీయంగా ఎలాంటి అప్ డేట్స్ లేవు. కాని సడెన్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు గులాబీ బాస్. శుక్రవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఫ్లోర్ లీడర్లును పిలిచారు. పార్టీ ముఖ్య నేతలు కూడా కేసీఆర్ సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తుండటం చర్చగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో చర్చించడానికే కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కొంత కాలంగా దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన పలుసార్లు కీలక ప్రకటనలు చేశారు. దేశంలో త్వరలో సంచలనం జరగబోతోందని చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ ప్రకటనలు జాతీయ స్థాయిలో చర్చగా మారాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారనే వాదన ఉంది. అందుకోసనే వివిధ రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో చర్చలు జరిపారని చర్చ సాగింది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతో తన కార్యాచరణను కేసీఆర్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ నేతలతో మాట్లాడుతున్నారనే టాక్ వస్తోంది.


జాతీయ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశ రాజధానిలో ఆప్ చీఫ్, ఢిల్లీ  ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో చర్చలు జరిపారు. ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో పాటు ఎన్‌సీపీ నేత శరద్ పవార్ తో మంతనాలు సాగించారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పలు దఫాలుగా చర్చించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు కేసీఆర్. త్వరలో మరోసారి చెన్నై వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కూడా కేసీఆర్ మంత్రాగం చేశారు.


READ ALSO: Hyderabad Gang Rape: నమ్మించి తీసుకెళ్లారు.. బెదిరించి రేప్ చేశారు! కార్పొరేటర్ కొడుకే మాస్టర్ మైండ్..


READ ALSO: NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... తెలుగు ప్రజలకు ఆర్బీఐ శతకోటి కానుక  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి