హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చలో కేవలం వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలు అంటే ఒకరినొకరు దూషించుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం  మాత్రమే కాదని సూచించిన కేసీఆర్.. ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావొద్దని అభిప్రాయపడ్డారు. సభలో స్ఫూర్తిదాయకమైన పద్ధతిలో చర్చలు జరగాలని.. వాస్తవాల ఆధారంగానే అంశాలపై చర్చించుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. Also read : Revanth Reddy: కేసీఆర్, జగన్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై సీఎం కేసీఆర్ సమీక్ష హాజరైన మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లు ఈ నెల 7 నుంచి...

Posted by Zee Hindustan Telugu on Thursday, September 3, 2020

 


అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలపై మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ వ్యాప్తి-నివారణకు తీసుకుంటున్న చర్యలు, కరోనా సోకిన బాధితులకు వైద్య సహాయం, కొత్త రెవెన్యూ చట్టం, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లింపు, ఇటీవల శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన, పీవీ శతజయంతి ఉత్సవాలు, నియంత్రిత పద్ధతిలో పంటలసాగు వంటి అంశాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి. Also read : Telangana: కొత్తగా 2,817 కరోనా కేసులు