Telangana: శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి, సీఐడీ విచారణకు ఆదేశాలు

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ( Srisailam left canal ) జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు అధికార్లు ధృవీకరించారు. మొత్తం 9 మంది చిక్కుకుపోగా...ఆరుగురు మృతి చెందినట్టు నిర్ధారించారు. అటు జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ ( CID probe ) కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Last Updated : Aug 21, 2020, 05:06 PM IST
Telangana: శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి, సీఐడీ విచారణకు ఆదేశాలు

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ( Srisailam left canal ) జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు అధికార్లు ధృవీకరించారు. మొత్తం 9 మంది చిక్కుకుపోగా...ఆరుగురు మృతి చెందినట్టు నిర్ధారించారు. అటు జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ ( CID probe ) కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ వైపున్న భూగర్భ జలవిద్యుత్ ( Power plant ) కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ( Fire acccident ) తెలిసిందే. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం నుంచి 8 మందిని ఇప్పటికే కాపాడారు. మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకోవడంతో సొరంగ మార్గంలో 9 మంది చిక్కుకుపోయారు ( 9 have been strucked ). వీరిని రక్షించడానికి 38 మంది సభ్యుల అగ్నిమాపక దళం  తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా వీరంతా ఈ ప్రమాదంలో మరణించినట్టు అధికార్లు ధృవీకరించారు. సహాయకు చర్యలు చేపడుతున్న సిబ్బంది మృతదేహాల్ని ( 6 found dead ) గుర్తించారు. ఒకరు సూర్యాపేటకు చెందిన ఏఈ  సుందర్ గా అధికార్లు గుర్తించారు. మిగిలినవారెవరనేది ఇంకా తెలియలేదు. దట్టమైన పొగలు కమ్ముకుని ఉండటం, సొరంగ మార్గం కావడంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం కలుగుతోంది.  

మరోవైపు ఈ ప్రమాదంపై సీఐడీ విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( Telangana cm kcr ) ఆదేశించారు. ప్రమాదానికి  కారణాలు, దారి తీసిన పరిస్థితులు తెలియాలని కేసీఆర్ తెలిపారు. సీఐడీ అడిషనల్ డిజిపీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమించారు. Also read: Kishan Reddy: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే!

Trending News