Telangana: సేంద్రీయ సాగు కాదు.. ఇప్పుడు కొత్త సాగు పద్ధతి. అదే వేద సాగు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతు అనుభవం సాధించిన విజయం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు. విందుకు ఆహ్వానించారు. ఆ విశేషాలివీ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు ( Farmer Prasada rao ).నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన రైతు. మరీ ముఖ్యంగా వేదసాగులో దిట్ట. వేదసాగులో వ్యవసాయానికి పాడి పరిశ్రమను జోడించి సాధించిన విజయాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangan cm kcr ) స్వయంగా ప్రసాదరావుకు ఫోన్ చేశారు. దాదాపు పది నిమిషాల సేపు మాట్లాడి..ఆయన అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు.  


వేదసాగు ( Vedic farming ) అనుభవాల్ని..ఆయన చేసిన కృషి గురించి అడిగారు. 4 దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు అనుబంధ రంగాల్లో చేసిన పరిశోధనల్ని తెలంగాణ రాష్ట్రంలో ఆచరించేందుకు కేసీఆర్ ( KCR ) సంకల్పించారు. పది నిమిషాల సేపు మాట్లాడిన తరువాత..విందుకు ఆహ్వానించారు.  వేద పద్ధతిలో వరి సాగులో దిగుబడులు, ఖర్చు వివరాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ప్రసాదరావు తెలిపారు. రెండ్రోజుల్లో కారు పంపుతానన్నారని చెప్పారు.   


వ్యవసాయం ( Agriculture )తో పాటు 250 గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ల పెంపకం చేస్తున్నానని..దాంతో పొలానికి సేంద్రీయ ఎరువులు అందడంతో భూమి ఆరోగ్యం పెరిగిందన్నారు. ఫలితంగా మంచి దిగుబడులు వస్తున్నాయన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అడగడం చాలా సంతోషాన్ని కల్గించడమే కాకుండా గర్వంగా ఉందన్నారు. వేదసాగు పద్ధతిలో ఖర్చులు తగ్గి..దిగుబడి పెరుగుతుందన్నారు. 


Also read: Gold Smuggling: తెలివిగా బంగారం స్మగ్లింగ్.. కస్టమ్స్‌ చాకచక్యం, నిందితుడి అరెస్ట్