కోవిడ్19 సేవలు అందిస్తున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనం అందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని, న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుందన్నారు. అయితే కరోనా కష్టకాలంలో సమ్మె (Junior Doctors Strike)కు పిలుపు నివ్వడం మంచిది కాదని జూనియర్ డాక్టర్లకు హితవు పలికారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ డ్రైవ్, తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో వైద్యశాఖ అధికారులతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సమ్మె (Junior doctors strike) చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్-19 సేవలు అందిస్తున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని నిర్ణయించారు.


Also Read: Super Spreaders: కోవిడ్-19 వ్యాక్సినేషన్, Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం


కరోనా సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారి కోరిక మేరకు సత్వరమే అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఆదేశించారు. జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్‌ను చాలా రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.


Also Read: Chandra Grahanam 2021: చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉండాలి



జూనియర్ డాక్టర్ల సమస్యలపై అధికారులను ఆరాతీసిన సీఎం కేసీఆర్ వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదన్నారు. అయితే కోవిడ్19 విపత్కర సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook