Godavari Floods: గోదావరి వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్రలు.. విదేశీ శక్తుల పాత్ర ఉండొచ్చన్న కేసీఆర్
Godavari Floods: గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు. దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు.
Godavari Floods: గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు. దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు. దేశంలో ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారన్న కేసీఆర్.. గతంలో లడఖాలోనే లేహా లో ఇలాంటే వరదలే వచ్చాయన్నారు. ఉత్తరాఖండ్ లో అలాగే చేశారన్నారు.మన దేశంలోనూ కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని కేసీఆర్ చెప్పారు. కడెం ప్రాజెక్ట్ దేవుడి దయ వల్లే బయటపడిందన్నారు కేసీఆర్. కడెం ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్ధ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా ఎగువ నుంచి ఐదు లక్షల వరద వచ్చిందన్నారు.
గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు సీఎం కేసీఆర్. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు, వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అధికారులను భద్రాచలం పంపించామని కేసీఆర్ తెలిపారు. భద్రాచలంలో శాశ్వాత కాలనీల నిర్మాణం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు కేసీఆర్. ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.జూలై చివరు వరకు భారీ వర్షాలు ఉంటాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కరకట్ట పొడిగింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పారు కేసీఆర్. పక్క రాష్ట్రమే కదా.. పాకిస్తాన్ కాదు కదా అంటూ కామెంట్ చేశారు కేసీఆర్.
Read Also: Pawan Kalyan: జనసేనతోనే మార్పు సాధ్యం..గోదావరి ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపు..!
Read Also: Revanth Reddy: అటు రేవంత్ రెడ్డి.. ఇటు భట్టి విక్రమార్క.. పోటీపోటీ సమావేశాలతో టీకాంగ్రెస్ లో కాక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook