Pawan Kalyan: రాష్ట్రం మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి గోదావరి జిల్లా ప్రజలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో గోదావరి జిల్లాల ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని.. చెల్లించే పన్నులనే ప్రజలకు ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు.
అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. కౌలు రైతుల కుటుంబాలకు ఇప్పటికే కోట్ల రూపాయల సాయం చేశామన్నారు. జేబులో డబ్బు తీసి ఇవ్వడం తమకేం సరదా కాదని..రైతులకు అండగా నిలిచేందుకు ఇదంతా చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు రూ.7 లక్షల బీమా సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదని విమర్శించారు.
అంబేద్కర్‌ను తాను స్ఫూర్తిని తీసుకున్నానని..ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మభ్యపెట్టేందుకే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో నా తెలంగాణ అనే భావన ఉందని..అదే ఇక్కడ కులమనే భావన ఉందని చెప్పారు. కోనసీమ జిల్లా మండపేటలో ఆయన పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also read:PM Modi: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరం..యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
Also read:EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులారా గమనించారా..నిబంధనల్లో కీలక మార్పులు ఇవే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook