Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. అందరూ ఊహించినదానికి భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పట్టభద్రుల ఓట్లను గెల్చుకుంటారా మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ( Telangana )రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండూ పట్టభద్రుల నియోజకవర్గాలు. అధికార పార్టీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్ధుల్ని ఖరారు చేశాయి. ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ స్థానం నుంచి రాములు నాయక్‌ కాంగ్రెస్ పార్టీ తరపున, పల్లా రాజేశ్వరరెడ్డి టీఆర్ఎస్( TRS )పార్టీ తరపున, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరపున బరిలో ఉండగా.. ఫ్రొపెసర్‌ కోదండరాం, తీన్‌మార్‌ మల్లన్నలు కూడా పోటీలో ఉన్నారు. ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి  కాంగ్రెస్ నుంచి, రామచంద్రారెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. మరి ఈ స్థానం నుంచి అందరూ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావును టీఆర్ఎస్ ప్రకటిస్తుందనుకున్నారు. కానీ కేసీఆర్ ( KCR ) అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నరశింహారావు ( Pv Narasimha rao ) కుమార్తె వాణిదేవిని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. 


ఇప్పుడీ ఎన్నిక రసవత్తరం కానుంది. పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వాస్తవానికి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ( Graduates mlc election )అంత సునాయసం కాకపోవచ్చు అధికారపార్టీకు. ఎందుకంటే కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ఉద్యోగాలు పోవడం ఇవన్నీ సహజంగానే అధికార పార్టీకు ఇబ్బంది కల్గించే పరిణామాలే. ఏడాదిన్నరగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడం కూడా నిరుద్యోగుల్లో అసంతృప్తికి కారణంగా ఉంది. ఈ సమస్యల్ని అధగమించి అధికార పార్టీ విజయం సాధించాలంటే గట్టిగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. 


Also read: Telangana కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ, BJPలో చేరనున్న కూన శ్రీశైలం గౌడ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook