KCR Delhi Tour: ఇవాళ కేజ్రీవాల్ తో కేసీఆర్ లంచ్ మీటింగ్.. కొత్త కూటమిపై క్లారిటీ వచ్చేనా?
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. శనివారం పలు కీలక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. శనివారం పలు కీలక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో మరోసారి సమావేశం కాబోతున్నారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆదివారం మధ్యాహ్నం 6 ఫ్లాగ్ స్టాఫ్ మార్గ్, సివిల్ లైన్స్ లోగల ఢిల్లీ సీఎం నివాసానికి వెళతారు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
శనివారం ఢిల్లీలో పర్యటించారు కేసీఆర్. కేజ్రీవాల్ సర్కార్ అద్భుతంగా నిర్మించిన సర్వోదయ స్కూల్ తో పాటు ప్రస్తుతం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న మొహల్లా క్లీనిక్ ను పరిశీలించారు. వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా కేసీఆర్ కు తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అయితే కేసీఆర్ తో సమావేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానం దాట వేశారు. తాము రాజకీయాలు చేయం.. హాస్పిటల్స్, స్కూల్స్ మాత్రమే కడతామంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చూసేందుకు వచ్చిన సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని కేజ్రీవ్ల అలా కామెంట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఇవాళ కేసీఆర్ ను లంచ్ కు ఆహ్వానించారని అంటున్నారు.
ఆదివారం జరగనున్న లంచ్ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపై కేసీఆర్, కేజ్రీవాల్ చర్చిస్తారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. గతంలోనే ఆయన ముంబై వెళ్లి శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో చర్చించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. బెంగళూరు వెళ్లి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లో మంతనాలు సాగించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ తో చర్చలు సాగించారు కేసీఆర్. కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మంత్రాగం నడిపారు.
READ ALSO: Srilanka Crisis:15 వందలకు లీటర్ పెట్రోల్.. శ్రీలంకలో పెరుగుతున్న ఆకలి చావులు
READ ALSO: Monkeypox Virus: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం.. 120 కేసులు నమోదు! డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి