Srilanka Crisis:15 వందలకు లీటర్ పెట్రోల్.. శ్రీలంకలో పెరుగుతున్న ఆకలి చావులు

Srilanka Crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో విధించిన ఎమర్జెన్సీని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 09:18 AM IST
  • ఎమర్జెన్సీని ఎత్తివేసిన శ్రీలంక ప్రభుత్వం
  • శ్రీలంకలో తీవ్రమైన పెట్రోల్, ఆహార కొరత
  • లీటర్ పెట్రోల్ రేట్ రూ. 1500
Srilanka Crisis:15 వందలకు లీటర్ పెట్రోల్.. శ్రీలంకలో పెరుగుతున్న ఆకలి చావులు

Srilanka Crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో విధించిన ఎమర్జెన్సీని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది.పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత.. నిత్యావసరాల ధరలు పెరగడంతో లంకేయులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలిపారు,. దీంతో మే6వ తేదీ అర్ధరాత్రి దేశంలో అత్యవసర స్థితి ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. రెండు వారాల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసింది. ఎమర్జెన్సీని అమలు చేయడం లేదా కొనసాగించడం పార్లమెంటుపై ఆధారపడి ఉంటుంది, దీనిని రాష్ట్రపతి నోటిఫికేషన్ చేసిన 14 రోజులలోపు సభకు సమర్పించాలి. అయితే పార్లమెంట్‌లో ఎమర్జెన్సీ నిబంధనలను ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.నెలలోనే శ్రీలంకలో రెండుసార్లు ఎమర్జెన్సీ విధించారు.

ఎమర్జెన్సీ సమయంలో కూడా శ్రీలంకలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.ఈ ఘర్షణల్లో 9 మంది చనిపోవడంతో పాటు 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆర్మీ, పోలీసులకు ఆందోళనలను అణచివేయాలని విశేషాధికారాలు కల్పించింది గోటబయ సర్కార్. ఎమర్జెన్సీ సమయంలో, పోలీసులు మరియు భద్రతా బలగాలకు ఎవరినైనా అరెస్టు చేయడానికి మరియు నిర్బంధించడానికి అపరిమితమైన అధికారం ఉంటుంది. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయవచ్చు. ఎమర్జెన్సీని ఎత్తేయడంతో శ్రీలంక ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.

కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.దిగుమతి చేసుకున్న ఆహార ధాన్యాలు మరియు ఇంధనం కోసం దేశం చెల్లించలేని విదేశీ మారకద్రవ్యం కారణంగా ఈ సంక్షోభం తలెత్తింది. దీంతో నిత్యావసర సరుకులకు తీవ్ర కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం పెరిగింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు.  పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స సహా పలువురు నేతల ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఆందోళనలతో దిగొచ్చిన  నేపథ్యంగాలో  మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొత్త సర్కార్ కొలువుదీరింది. కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించారు అధ్యక్షుడు రాజపక్స.

మరోవైపు శ్రీలంకలో ద్రవ్యోల్భనం 40 శాతం దిశగా దూసుకుపోతోంది. పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో నిధులు లేవు.దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్ కోసం వాహనదారులు బంకుల ముందు కొట్టుకుంటున్నారు. బ్లాక్ లో లీటర్ పెట్రోల్ రూ. 1200-1500 వరకు పలుకుతోంది. కరెంట్ కోతలతో శ్రీలంక జనాలు అల్లాడిపోతున్నారు. శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత ఇలాంటి ఆర్థిక సంక్షోభం రావడం ఇదే తొలిసారి.  సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే ఎంతో సాయం చేసిన భారత్.. శనివారం మరో 40 వేల టన్నుల డీజిల్ ను శ్రీలంకకు సరఫరా చేసింది. నౌకలో 45 కోట్ల రూపాయల విలువైన  బియ్యం, మందులు, పాలపొడిని పంపించింది. ఇక శ్రీలంకకు 11. 67 కోట్ల అత్యవసర సాయం ప్రకటించింది జపాన్.

READ ALSO: KCR Tour: అఖిలేష్ మౌనం.. పాలిటిక్స్ లేవన్న కేజ్రీవాల్! ఢిల్లీలో కేసీఆర్ చర్చలు ఉత్తవేనా?
READ ALSO: YCP MLC Ananthbabu: వైసీపీ ఎమ్మెల్సీని కాపాడుతున్నారా? హత్య కేసు నమోదైనా పట్టుకోలేరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News