Telangana cm Revanth Reddy ap cm Chandrababu naidu meeting: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటలకు సీఎంల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, సీఎస్ లు, కీలక అధికారులు హజరయ్యారు. తెలంగాణ నుంచి మంత్రులు భట్టీ విక్రమార్క,శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారీ, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి,జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గెష్, సీఎస్ నీరభ్ కుమార్ ఇతరు అధికారులు హజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
 


ఇదిలా ఉండగా దాదాపు రెండు గంటల పాటు సమావేశం వాడీ వేడిగా జరిగినట్లు తెలుస్తోంది. మొదట చంద్రబాబుకు పుష్పగుఛ్చం ఇచ్చిసాదరంగా ఆహ్వనించిన, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.


సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణ రావు రాసిన, నాగోడవ కవితా సంకలానాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కానుకగా ఇచ్చారు. కాళోజీ నారాయణ రావు, నిజాం, నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. తెలంగాణ వనరులను దోపిడీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం మీద.. దీన్ని బట్టి తమ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం దేనీ కైన సిధ్దమన్న సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది.


 సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ నాగోడవ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఇండైరెక్ట్ మెస్సెజ్ ఇచ్చారు. అంతేకాకుండా.. సుమారు రెండు గంటల పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని వేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.


పది అంశాలు ప్రధాన ఎజెండా..


పది అంశాలలో ముఖ్యంగా.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం, 9,10 షెడ్యూల్ లోని అంశాలు,
విభజన చట్టంలోనిన పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు..
ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
పెండింగ్ విద్యుత్ చార్జీల అంశం
ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి స్టేట్స్ లో 15 ప్రాజెక్టుల నిర్మాణం, వాటి పంపాకాలు
హైదరాబాద్ లో ఉన్న మూడు భవనాలు ఏపీకీ కేటాయించడం
లేబస్ సెస్ పంపకాలు


Read more:Cm Revanth Reddy: చంద్రబాబును ఆ కానుకతో సర్ ప్రైజ్ చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజాభవన్ లో అరుదైన దృశ్యం..


ఇరు తెలుగు స్టేట్స్ ల ఉద్యోగుల విభజన అంశాలు వంటివి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా మంత్రులు, అధికారులతో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కందిశగా ముందుకు వెళ్లాలనీ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి