Telangana cm Revanth Reddy presented kaloji naa godava book to ap cm Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో సమావేశం అయ్యారు. సాయంత్రం 6 గంటలకు సీఎంల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పుష్ఫగుఛ్చం ఇచ్చి వెల్ కమ్ చెప్పారు.ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, కీలక అధికారుల మధ్య సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విభజన సమయంలో కొన్నిసమస్యలు ఇప్పటికి పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరు సీఎంల భేటీ మాత్రం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరిచుకుంది.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారీ, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మొత్తంగా పదిహేను అంశాలమీద చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముంపు మండలాలు తిరిగి తెలంగాణలో, టీటీడీ పాలనలో సమ ప్రాధాన్యత, షెడ్యూల్ 9,10 కి చెందిన అంశాలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ప్రజాభవన్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రికి కాళోజీ నారాయణరావు రచించిన నా గోడవ పుస్తకాన్ని బహుకరించి సర్ ప్రైజ్ చేశారు. అంతేకాకుండా.. శాలువాను కూడా కప్పారు. నిజాం పాలనలో కాళోజీ రజాకార్లు, అప్పటి అన్యాయాలను ప్రశ్నిస్తూ తన గొంతుక విన్పించారు. ఈ క్రమంలో ఈ అరుదైన కానుక ఇవ్వడం మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడిగా కాళోజీగారిని చెప్పుకొవచ్చు. కాళోజీగారు.. 1914 లో కర్నాటక బీజాపూర్‌లోని రట్టిహళ్లిలో జన్మించారు.ఈయనను ముద్దుగా కాళోజీ అని పిలుస్తుంటారు. తెలంగాణ ప్రాంతానికి ఎంతో సేవలు చేశారు. కాళోజీని పద్మవిభూషణ్ తో సత్కరించారు.
కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అనేక రచనలు చేశారు. ఈయన రాసిన నాగోడవ సంకలనం ఎంతో ఫెమస్ అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి