Telangana CM Revanth Reddy Astrological Predictions In Krodhi Nama Samvatsara 2024-25: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన చరిష్మాతో పాలన అందిస్తున్నారు. గత సీఎం కేసీఆర్ పాలన పట్ల పూర్తిగా ప్రజల్లో ఒకరకమైన నెగెటివ్ భావం కల్గించేలా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ మంచి వాగ్ధాటి, ముక్కుసూటి తనకం కలవాడు. ఎంతటి కష్టాలు పెట్టిన, కేసులు పెట్టిన కూడా ధైర్యం విడువలేదు. ఇంటి బెడ్ రూమ్ ను పగలగొట్టి పోలీసులు లోపలికి ప్రవేశించిన కూడా ఆయన వెన్నుచూపలేదు. కూతురు పెళ్లివేడుకకు దూరంచేసిన కూడా ఆయన తనమనో బలాన్ని మాత్రం కోల్పోలేదు. అన్నింటికి తప్పనిసరిగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం పక్కాఅనే ధోరణిలో ముందుకు వెళ్లారు. ఆయన అన్నట్లుగానే.. తెలంగాణ ఎన్నికలలో మంచి మెజారిటీతో కాంగ్రెస్  ప్రభుత్వంను ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Telugu Year Ugadi 2024-25: క్రోధి నామసంవత్సరం అంటే అర్ధం ఏంటో తెలుసా..?


సీఎం రేవంత్ కు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఏనాడు మంత్రిగా చేసిన అనుభవం లేదు. పైగా ఆయనకన్న అనుభవం, సీనియారిటీ ఉన్న నేతలకు వరుసగా చెక్ పెడుతూ.. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో నిలబడ్డారు. ఆయన మోండితనం, పబ్లిక్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు జనాన్ని ఉత్సాహపరిచే విధంగా ఆయన మాట్లాడే వారు. అదే విధంగా ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి, అనూహ్యాంగా పెద్దల ఆశీస్సులతో సీఎం వరకు తన ప్రస్థానం కొనసాగించారు.


ప్రస్తుతం క్రోధి నామసంవత్సరం సీఎం రేవంత్ రెడ్డికి ఎలా ఉండబోతుందని తెలుగు ప్రజలు ఆసక్తితో సెర్చ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. నవంబరు నెల 8 న, 1969 లో మధ్యాహ్నం 2 గంటలకు జన్మించారు. ఆయనది తులరాశి, చిత్తా నక్షత్రంగా సమాచారం.  అయితే.. గత మాజీ సీఎం కేసీఆర్ రెండుసార్లు సీఎం కావడంతో ఒకరకమైన అహాంకారపూరితంగా ప్రవర్తిచినట్లు తెలుస్తోంది. అపోసిషన్ నేతలను వేధించడం, ప్రజలను పట్టించుకోకపోవడం, మంత్రులు ఇష్గారాజ్యంగా వ్యవహరించడంతో ప్రజలు విసిగెత్తిపోయారు. అదేసమయంలో రేవంత్ రాజకీయాల్లో ఒక్కసారిగా యాక్టివ్ గా మారిపోయారు.


ఇక.. కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారో.. అప్పుటి నుంచి గులాబీ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పుకొవచ్చు. ప్రధాని పట్ల అగౌరవంగా ప్రవర్తించడంతో రాష్ట్రానికి అనేక విషయాల్లో కలిగిన నష్టాలను రేవంత్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ ఒంటెద్దు పొకడలు, ప్రగతి భవన్ పాలనపట్ల విరక్తితో రగిలిపోయారు. వీటన్నింటిని సీఎం రేవంత్ మెట్లుగా పర్చుకుంటూ, అంచెలంచెలుగా సీఎం స్థాయి వరకు ఎదిగారు. పార్టీలోని సీనియర్లను కలుపుకుని పోవడం, కొందరితో మాట్లాడి, వ్యవహరాలు సద్దుమణిగేలా చేసుకొవడం లో రేవంత్ తన చతురత కనబర్చారు. గతంలో వైఎస్సార్ మాదిరిగా.. రేవంత్ ఢిల్లీ పెద్దల దగ్గర మంచి మార్కులు కొట్టేయడంలో సక్సెస్ అయ్యారు. తన గురించి నెగెటివ్ ప్రచారం బైటకు రాకుండా రేవంత్ ఎంతో అలర్ట్ గా ఉండేవారు.


సీఎంగా ప్రమాణ స్వీకారంచేసేటప్పుడు.. ప్రగతి భవన్ గేట్లు కూల్చేయడం, ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, ఆరుగ్యారంటీలు అమలు చేయడం, ఇటు తెలంగాణలోని అనేక శాఖలను సీఎం రేవంత్ సమూలంగా ప్రక్షాళన చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ప్రజల ముందుంచారు. దీంతో అనేక మంది బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తుక్కుగూడ జనజాతర సీఎం రేవంత్ కు మరో మైలురాయిగా చెప్పుకొవచ్చు.


Read More: PM Narendra Modi Horoscope: క్రోధీ నామ సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం గ్యారంటీనా..?


కాంగ్రెస్ హైకమాండ్ తరలివచ్చిన ఈ సభకు , జనాలు తండోపతండాలుగా వచ్చారు. అగ్రనాయకులంతా.. రేవంత్ ను ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక మరో రెండు రోజుల్లో క్రోధి నామ సంవత్సరం రాబోతుంది. సీఎం జాతకం ప్రకారం.. ఆయనకు నూతన తెలుగు సంవత్సరంలో కూడా మహర్దశ పట్టనుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎలాంటి అంతరాయంలేకుండా సీఎంగా ఆయన టెర్మ్ పరిపాలిస్తాడని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్లులో ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదని కూడా ఆయన జాతకం ప్రకారం తెలుస్తోందని జ్యోతిష్యలు వెల్లడిస్తున్నారు.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook