Telugu Year Ugadi 2024-25: క్రోధి నామసంవత్సరం అంటే అర్ధం ఏంటో తెలుసా..?

Ugadi Panchangam 2024-25: హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి రాబోతున్న తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు. దీని వెనుక ఉన్న అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 5, 2024, 08:37 AM IST
  • ఉగాదిని.. సంవత్సారానికి మొదటి రోజుగా చెబుతారు..
  • పురాణాల ప్రకారం నారదుడికి 60 మంది సంతానం..
 Telugu Year Ugadi 2024-25: క్రోధి నామసంవత్సరం అంటే అర్ధం ఏంటో తెలుసా..?

Sri Krodhi Nama Samvastaram 2024-25: హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పండగకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీన్ని ఉగాది, యుగాది.. యుగానికి ఆది అంటే ఏడాదికి మొదటి రోజుగా జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయం నుంచి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఉగాది రోజున ముఖ్యంగా చాలా చోట్ల దేవుళ్లను ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజున ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. కొత్త పంచాంగం పూజ,  పంచాంగ శ్రవణం, ధ్వజారోహాణ కార్యక్రమం, ఉగాది పచ్చడి చేసి దేవుడికి నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు ఉగాది రోజున కొత్తబట్టలు కొనుగోలు చేస్తారు. అదే విధంగా.. షడ్రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకంగా కొత్తగా మార్కెట్లో  వచ్చే మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం,మిరియాలు, వేపపువ్వు లతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు.

Read More: Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

మనిషి జీవితంలో.. కొన్నిసార్లు బాధలు, ఆనందాలు తదితర భావోద్వేగాలతో కలిసి ఉంటుంది. అలానే.. ఉగాది పచ్చడిలో కూడా.. చేదు,కారం, తీపి, వగరు గుణాలు ఉంటాయి. అంటే.. మనం జీవితంలో ఆనందాలు వచ్చిన, బాధలు వచ్చిన కూడా అన్నింటిని సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఆనందం వచ్చిందని ఎక్కువగా పొంగిపోకుండా, బాధలు వచ్చాయని ఎక్కువగా మనస్తాపం చెందకూడదని జ్యోతిష్యలు  చెబుతుంటారు.

ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు మనకు 60 ఉన్నాయి. ఇవి ప్రతి ఏడాది మారుతు ఉంటాయి. దీనివెనుక కొన్ని పురాణా గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుమాయ కారణంగా.. నారదుడికి 60 మంది సంతానం జన్మించారంట. ఈ 60 మంది ఎప్పటికి గుర్తుండిపోయేలా వరమియ్యమని నారదుడి, విష్ణుభగవానుడిని వేడుకున్నాడ. దీంతో ఆయన వీరి పేర్లు.. శాశ్వతంగా నిలిచిపోతుందని వరంఇచ్చారంట. మనం ప్రతిఏడాది మారుతున్న ఈ తెలుగు సంవత్సరాలు పేర్లు, నారదుడి కుమారుల పేర్లు అన్నమాట.

అయితే.. ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని అర్థం. అదే విధంగా.. తెలుగు సంవత్సరాలు ప్రతి 60 ఏళ్లకోసారి రిపీట్ అవుతుంటాయి. ప్రస్తుతం రాబోతున్న క్రోధి నామసంవత్సరం.. 1904-05,1964-65, మరల ఇప్పుడు 2024-25 లో వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రోధి వెనుక ఉన్న అర్ధం, దీని వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం.

క్రోధి అంటే క్రోధం, కోపం, ఒకర్ని సహించలేకపోవడం అని అర్ధం. అంటే కోపాన్ని కలిగించేది అని అర్ధం. ఈ క్రమంలో జ్యోతిష్యులు ముఖ్యంగా... ఈ తెలుగు సంవత్సరం పేరులాగే.. క్రోధాన్ని కల్గిఉంటారు. కొన్ని చోట్ల అనవసరంగా వాదోపవాదాలు, ఘర్షణలు, తలెత్తె అవకాశం ఉందని చెబుతుంటారు. కానీ క్రోధి అనగానే అదేదో చెడుచేసే సంవత్సరం అనికాదు. కేవలం అది ఆ పదానికి ఉన్న అర్ధం మాత్రమే. ముఖ్యంగా మనం చేసే పనులు, కర్మలే మనకు వచ్చే ఫలితాలను నిర్దేషిస్తాయి. మంచి పనులు,కర్మలు చేస్తే, మంచి రిజల్ట్ వస్తుంది.

Read More: Famous Astrologer Venu Swamy: రొమాంటిక్ మూడ్ లో వేణుస్వామి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వీడియో..

చెడు కర్మలు చేస్తే,ఒకరికి హానీ తలపెట్టాలని చూస్తే, అచ్చం అలాంటి ఇబ్బందులే కల్గుతాయని కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అదే విధంగా ఈసారి క్రోధి నామసంవత్సరంలో ముఖ్యంగా వివాహాలకు సంబంధించి పెద్ద ఇబ్బందులు ఉన్నాయని చెప్పవచ్చు. ఈసారి గురు మూఢమి, శుక్రమూఢమి రావడం వల్ల, మూహుర్తాలు చాలా తక్కువ. ఏప్రిల్ 24 వరకు కొన్ని మూహుర్తాలు ఉన్నాయి. అదే విధంగా.. అక్టోబర్ మాసం తర్వాత మూహుర్తాలు ఉండటం వల్ల పెళ్లికానీ వారికి ఇబ్బందులని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News