CM Revanth Reddy Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు, మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయమై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటుండటంతో ఎవరికి ఛాన్స్ లభిస్తుందనేది ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్ తదితరులతో కీలకాంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి పది రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఎలా ఉందో చర్చించవచ్చు. అదే విధంగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చ ఉంటుంది. 


తెలంగాణ కేబినెట్‌లో మరో ఆరుగురికి స్థానముంది. ఈసారి మంత్రిమండలిలో షబ్బీర్ అలీకు అవకాశముండవచ్చని ప్రధానంగా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 22తో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత 24, 25 తేదీల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. మంత్రిమండలి విస్తరణలో మిగిలిన 6 స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరగవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన నేతలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. పదేళ్ల తరువాత ప్రభుత్వం ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. 


ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇన్‌ఛార్జ్ కాగా, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లకు రేవంత్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యత తీసుకుంటారు. భువనగిరి ఇన్‌ఛార్జ్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనసాగనున్నారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరారు. అపాయింట్‌మెంట్ లభిస్తే మోదీను ఇవాళ లేదా రేపు కలిసే అవకాశాలున్నాయి. 


Also read: China Earthquake: చైనాలో భారీ భూకంపం, 111 మంది మృతి, 200 మందికి గాయాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook