Metro Rail Project: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నారు. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ గత ప్రభుత్వ నిర్ణయాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అవుటర్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టుపై కీలకమైన సంచలన నిర్ణయం తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. 69 వేల కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు విస్తరించాలనేది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం. అంటే పటాన్ చెరువు నుంచి నార్శింగి వరకూ 22 కిలోమీటర్లు, తుక్కుగూడ, బెంగళూరు, పెద అంబర్‌పేట్ వరకూ 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరించాల్సి ఉంటుంది. మరోవైపు తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకూ 8 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వరకూ 29 కిలోమీటర్రు, ఎల్బీ నగర్ నుంచి పెద అంబర్‌పేట్ వరకూ పొడిగించాల్సి ఉంటుంది. అదే విధంగా రాయదుర్గం నుంచి శంషాభాద్ విమానాశ్రయం వరకూ మెట్రో రైలుకు ఆమోదం తెలిపింది నాటి కేబినెట్. ఇప్పటికే ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.


ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలను సమీక్షిస్తున్నారు. ఓఆర్ఆర్ మెట్రో విస్తరణకు బ్రేక్ వేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మెట్రో రైలు ప్రాజెక్టు ఓఆర్ఆర్ వరకూ అవసరం లేదనేది రేవంత్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. అదంతా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయమనేది ఆయన ఆలోచన. ఓఆర్ఆర్ మెట్రో రద్దు చేసి ఆ స్థానంలో పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలనే ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. 


ఇందులో భాగంగా పెండింగులో ఉన్న జేబీఎస్ ఫలక్‌నుమా కారిడార్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయం వరకూ మెట్రో ప్రాజెక్టు పొడిగించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇది జరిగితే పాతబస్తీలో కూడా మెట్రో కవర్ చేసినట్టవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో మెట్రో అంశాన్ని చర్చించారు. 


Also read: Tear Gas Attack: లోక్‌సభలో దుండగులు, టియర్ గ్యాస్‌తో దాడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook