Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ ద్వారా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా తనకు కరోనా సోకినట్టు స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికల సందర్బంగా గత కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు సొంతపార్టీ నేతల విమర్శల మధ్య తీవ్రమైన ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా సోకడంతో..వైద్యుని సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో వెళ్లారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు.


Also read: Telangana Rain Alert: తెలంగాణను వదలని వరుణుడు.. మరో రెండు రోజులు కుండపోత వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook