Revanth Reddy Letter: ప్రధాని మోదీ రాకతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాని మోదీ, బీజేపీ టార్గెట్‌గా టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖను సంధించారు. ప్రధాని మోదీకి 9 ప్రశ్నలు సంధించారు. బీజేపీ,టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు గాలికి వదిలేసి..సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని..విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవి తెలంగాణకు రాలేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు రేవంత్‌రెడ్డి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోపాయకారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేస్తున్నారని లేఖలో ఫైర్ అయ్యారు. తెలంగాణపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల పథకం రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆరోపించారని..దీనిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. 


ఆర్మూర్‌లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏమయ్యిందన్నారు. ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మగారం ఎక్కడా అని లేఖలో ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు రావాల్సిన ఫ్యాక్టరీలు మహారాష్ట్రకు తరలిపోయాయని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్ మైల్‌ అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇందులో కేసీఆర్ బంధువులు ఉన్నారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ చీకటి స్నేహంతో తెలంగాణ నష్టపోతోందన్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి


Also read:PM Modi comments: కుటుంబం కోసం రాష్ట్రం ఏర్పాటు కాలేదు..కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఫైర్..!


Also read:Kodak Smart TV Flipkart: ఫ్లిప్ కార్ట్ లో పైసా వసూల్ ఆఫర్.. రూ.500 ధరకే స్మార్ట్ టీవీని కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి