Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600లే నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 23న ) సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 921 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారితో నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,65,049 కి చేరగా.. మరణాల సంఖ్య 1,437 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 1,097 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,52,565 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 8,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.28 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ


ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 42,740 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 23వ తేదీ వరకు మొత్తం 51,58,474 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 146 కేసులు నమోదయ్యాయి. Also read: Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ కన్నుమూత


[[{"fid":"198959","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణ కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]