Telangana COVID-19 Cases: తెలంగాణలో 1500 దాటిన కరోనా మరణాలు
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దాంతో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు తాజాగా పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దాంతో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు తాజాగా పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,135కి చేరింది.
Also Read: Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు
మంగళవారం ఒక్కరోజే 52,057 శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 536 మందికి కరోనా పాజిటివ్ రాగా, అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,502కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 622 మంది చికిత్స అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,70,450 మంది కోవిడ్-19 (COVID-19) నుంచి బారి కోలుకున్నారు.
Photos: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు
కాగా, తెలంగాణలో ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 5,041 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ కరోనా రికవరీ రేటు జాతీయ రేటు కన్నా అధికంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 95.20 శాతం ఉండగా.. తెలంగాణలో 96.88శాతం మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు.
Also Read : Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe