Telangana: తెలంగాణలో కరోనావైరస్ లేటెస్ట్ బులెటిన్ వివరాలు
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గురువారం 1,10,169 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,261 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇదిలావుంటే, మరోవైపు కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తోన్న కరోనా ఆయుర్వేదం మందు (Anandaiah mandu) కోసం తెలంగాణలోనూ డిమాండ్ కనిపిస్తోంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గురువారం 1,10,169 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,261 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 5,85,489 కు చేరింది. అదే సమయంలో కరోనా వైర్‌సతో మరో 18 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,331కు పెరిగింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం నాటి హెల్త్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 3,043 మంది కరోనావైరస్ నుంచి పూర్తి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,49,579కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,579 కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే (GHMC) అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా.. నల్లగొండ జిల్లాలో 160, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో 142 చొప్పున, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 127, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 108, కరీంనగర్ జిల్లాలో 101 కేసులు గుర్తించారు.
Also read : Ola Oxygen Concentrators: ఓలా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా మీ ఇంటి వద్దకే
ఇదిలావుంటే, మరోవైపు కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తోన్న కరోనా ఆయుర్వేదం మందు (Anandaiah mandu) కోసం తెలంగాణలోనూ డిమాండ్ కనిపిస్తోంది. ఆనందయ్య ఆయుర్వేదం మందు కోసం కృష్ణపట్నం వరకు వెళ్లాల్సిన పనిలేదని, అదే విధమైన ఆయుర్వేద వైద్యం ఇక్కడే లభిస్తుందిని కొంతమంది ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేదం ఔషధాల దుకాణదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారుచేస్తోన్న ఆయుర్వేద వైద్యం మందు (Krishnapatnam ayurvedic medicine) కోసం ప్రయత్నించేవారిని ఈ తరహా ప్రకటనలు అయోమయానికి గురిచేస్తున్నాయి.
Also read: Etela Rajender: ఈటల రాజేందర్ చేరికపై BJP MLA Raja Singh ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే, గతంలో తరహాలో ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం వరకు రావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే హోమ్ డెలివరీ (How to get Anandaiah ayurvedic medicine home delivery) చేస్తాం అని ఆనందయ్య టీమ్ సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే.
Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MLA Kakani Govardhan Reddy కీలక సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook