Ola Oxygen Concentrators: కరోనా రోగులకు ఇప్పుడు ఆక్సిజన్ ఓ అత్యవసరంగా మారింది. కోవిడ్ రోగుల కోసం ఓ2 ఫర్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఓలా ఫౌండేషన్..ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రోగులకు అందిస్తోంది.
కోవిడ్ రోగుల్ని ఆదుకునేందుకు ఓలా ఫౌండేషన్ ( Ola Foundation)ముందుకొచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండి ఆక్సిజన్ అవసరమైనవారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించేందుకు ఓ 2 ఫర్ ఇండియా కార్యక్రమం ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచిన ఓలా ఫౌండేషన్..హైదరాబాద్‌లో 5 వందల కాన్సంట్రేటర్లను సిద్ధం చేసింది. ఓలా యాప్ (Ola App)ద్వారా వినియోగదారులైన రోగుల్నించి సమాచారం తీసుకుంటుంది. అనంతంర నేరుగా రోగులకు ఇంటివద్దకే చేరవేస్తుంది. సదరు రోగి వినియోగించాక..పూర్తిగా శానిటైజ్ చేసి మరో రోగికి అందిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందినవారితో ఓలా క్యాబ్స్ (Ola Cabs)ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తోంది.
స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ..కొద్గిమొత్తంలో ఆక్సిజన్ అవసరమైనవారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు (Oxygen Concentrators) చాలా ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా హైదరాబాద్‌లో ఓ 2 ఫర్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం 3-4 గంటల వ్యవధిలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో తీసుకొస్తున్నారు.
Also read: Telangana: తెలంగాణలో తగ్గినట్టు కనిపిస్తున్న కరోనావైరస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook