Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. నిన్న (ఆదివారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,108కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం



నిన్న ఒక్కరోజే 28,980 శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 384 శాంపిల్స్‌కు పాజిటివ్ రాగా,  అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,496కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 631 మంది చికిత్స అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,69,232 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. 
Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!


 




కాగా, తెలంగాణలో ప్రస్తుతం 7,380 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 101 కరోనా పాజిటివ్ కేసులు రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.


Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి 


 


Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook