Crime Rate In Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2023లో జరిగిన క్రైమ్ రిపోర్ట్‌ను డీజీపీ రవి గుప్తా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97 శాతం క్రైమ్ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్‌తో పాటు కన్విక్షన్ రేట్ కూడా పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో వీఐపీల సెక్యూరిటీ కోసం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ ఎక్కడున్నాయనే వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తం 2 లక్షల 13వేల 121 కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే సైబర్‌ నేరాలు 17 శాతం కూడా పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది 1,108 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్స్‌ కేసులు ఎన్‌డీపీఎస్‌ కింద కేసులు నమోదు అయ్యాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి డ్రగ్స్‌ కేసులు 15.6 శాతం పెరిగాయని చెప్పారు. మహిళలపై 19 వేల 13 వేధింపుల కేసులు నమోదు నమోదు కాగా.. ఇందులో 2 వేల 284 రేప్‌ కేసులు ఉన్నాయన్నారు. 33 వరకట్న హత్యలు, 132 డౌరీ డెత్స్, 9 వేల 458 వరకట్న వేధింపుల కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక 212 మహిళల హత్యలు, 884 మహిళా కిడ్నాప్ కేసులు నమోదయ్యాన్నారు. 2 వేల 426 పోక్సో కేసులు నమోదు కాగా.. ఒక నిందితుడికి మరణశిక్ష పడిందన్నారు. 104 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు.


"యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేశాం.. ఇందులో భాగంగా 182 మందిని అరెస్ట్ చేసి.. 8 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం.. ఈ ఏడాది 20 వేల 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6 వేల 788 మంది చనిపోయారు. హ్యుమన్ ట్రాఫికింగ్‌ కేసులు 287 నమోదు అయ్యాయి. వీటిల్లో 557 మంది బాధితులను కాపాడాం. 


364 డ్రగ్ ట్రాఫికర్స్‌ను అరెస్ట్‌ చేశాం. ఈ ఏడాది 148 మావోయిస్టులను అరెస్ట్ చేశాం. 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రెండుసార్లు మావోయిస్టులు పోలీసుల మధ్య ఫైర్ జరిగింది. ఎంవీ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేసిన వారిపై ఒక కోటి 51 లక్షల కేసులు నమోదు చేశాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ ఏఢాది 587 ఎస్సై, 15వేల 750 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం" అని డీజీ రవి గుప్తా వెల్లడించారు.


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter