Cyber Fraud Recovery: సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు తెలంగాణ సైబర్‌ పోలీసులు అండగా నిలుస్తున్నారు. సైబర్‌ మోసాలపై అవగాహన కల్పిస్తూనే మోసపోయిన బాధితులకు సత్వర పరిష్కారం అందిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్‌ మోసగాళ్ల చేతిలో నష్టపోయిన సొత్తును తెలంగాణ పోలీసులు భారీగా రికవరీ చేశారు. ఐదు నెలల వ్యవధిలో మోసపోయిన బాధితులకు సంబంధించిన సొత్తు రూ.85 కోట్లను రికవరీ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Fire On Revanth: రేవంత్‌ రెడ్డి ఇదేనా ఇందిరమ్మ పాలన? థర్డ్‌ డిగ్రీ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం


రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాలలో మార్చి నుంచి జూలై 2024 వరకు సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.85.05 కోట్లు రీఫండ్ చేసినట్లు షికా గోయల్‌ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), న్యాయ సేవాధికార సంస్థ (టీజీఎల్ఎస్ఏ) సంయుక్త కృషితో పౌరులకు సంబంధించిన సొత్తును రికవరీ చేశారు. బ్యాంకుల్లో మోసపూరిత నిధులు తిరిగి చెల్లించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో టీజీసీఎస్బీ, టీజీఎల్ఎస్ఏ సహకారంతో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సహకరించి ఈ సొత్తును తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Also Read: RRB JE Jobs: రైల్వే నుంచి భారీ ఉద్యోగ ప్రకటన.. ఈసారి ఎలాగైనా రైల్వే జాబ్‌ కొడతారు పక్కా


మొత్తం 6,840 పిటిషన్లు న్యాయస్థానాల్లో ఫైలవగా.. 6,449 కేసులకు సంబంధించి రూ.85.05 కోట్ల మొత్తం రీఫండ్ చేశారు. వాటిలో రూ.36.8 కోట్లు సైబరాబాద్ కమిషనరేట్ అత్యధిక రీఫండ్ ఉండడం గమనార్హం. సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే "గోల్డెన్ అవర్"లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం. ఆ విధంగా బాధితులకు అవగాహన కల్పించి వెంటనే సొత్తు రికవరీ చేయడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రికవరీ భారీ స్థాయిలో చేపట్టింది.

మోసపోతే వెంటనే ఫిర్యాదు
ఈ సందర్భంగా టీజీసీఎస్బీ డైరెక్టర్‌ షికా గోయల్‌ ప్రజలకు కొన్ని జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్‌ మోసాలపై అవగాహన కలిగి ఉంటే మోసపోరని పేర్కొన్నారు. ఓటీపీలు, బ్యాంకు, యూపీఐ ఖాతాల వివరాలు అపరిచితులతో పంచుకోరాదని చెప్పారు. ఒకవేళ సైబర్‌ మోసాలకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter