RRB JE Jobs: రైల్వే నుంచి భారీ ఉద్యోగ ప్రకటన.. ఈసారి ఎలాగైనా రైల్వే జాబ్‌ కొడతారు పక్కా

RRB JE Recruitment 2024 Who Are Eligible How To Apply: రైల్వేలో సులభంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి భారీ శుభవార్త. ఆర్‌ఆర్‌బీ నుంచి అతిపెద్ద ఉద్యోగ ప్రకటన విడుదలైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 4, 2024, 03:10 PM IST
RRB JE Jobs: రైల్వే నుంచి భారీ ఉద్యోగ ప్రకటన.. ఈసారి ఎలాగైనా రైల్వే జాబ్‌ కొడతారు పక్కా

RRB JE Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు వినిపించింది. భారీగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది. కేవలం డిగ్రీ ఉంటే చాలు రైల్వే జాబ్‌ కొట్టవచ్చు. మొత్తం 7,951 ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో భర్తీ చేయనున్నారు. దేశంలోని అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Cable Operators: భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ప్రసారాలపై దుమారం.. జియో టీవీపై కేబుల్‌ ఆపరేటర్ల ఆందోళన

 

దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆర్‌ఆర్‌బీ ప్రకటన విడుదల చేసింది. జూలై 30వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమవగా ఆగస్టు 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రతియేటా విడుదల చేసే జాబ్‌ క్యాలెండర్‌లో తాజాగా విడుదల చేసిన ఉద్యోగాలు ఉన్నాయి. అయితే విడుదల చేసిన ఉద్యోగాలు జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు సంబంధించినవి. బీఈ, బీటెక్‌, బీఎస్సీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధం

 

ఉద్యోగ ప్రకటన వివరాలు
పోస్టుల పేర్లు:
జూనియర్‌ ఇంజనీర్‌ (డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు కెమికల్‌ సూపర్‌వైజర్‌, రీసెర్చ్‌ అండ్‌ మెటలర్జికల్‌ సూపర్‌వైజర్‌, రీసెర్చ్‌ పోస్టులు)
ఖాళీలు: 7,951
వేతనం: నెలకు రూ.35,400- రూ.44,900 ఉంటుంది.
అర్హులు: బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణులు
వయో పరిమితి: 18-33 వయసులోపు మాత్రమే అర్హులు. (ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు మినహాయింపు ఉంది.)
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రూ.250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక.
దరఖాస్తుకు చివరి తేదీ: 29, ఆగస్టు 2024
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్‌: ఆర్‌ఆర్‌బీఏపీపీఎల్‌వై.జీఓవీ.ఇన్‌ (rrbapply.gov.in)
సిలబస్‌: స్టేజ్‌ 1 రాత పరీక్షకు 100 మార్కులు ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌, గణితం, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌.
స్టేజ్‌ 2 రాత పరీక్షకు 150 మార్కులు ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌, ఫిజిక్స్‌ అండ్‌ కెమెస్ట్రీ, బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ అప్లికేషన్స్‌, బేసిక్స్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌, టెక్నికల్‌ ఎబిలిటిస్‌,

ఆర్‌ఆర్‌బీ రీజయన్లు: అహ్మదాబాద్‌, అజ్మీర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగడ్‌, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్‌, జమ్మూ శ్రీనగర్‌, కోల్‌కత్తా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్‌రాజ్‌, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News