Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?
Revanth Reddy Will Be Approve Two DAs To Employees: దీపావళి పండుగకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏలు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది.
Pending DAs: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతున్నట్టు కనిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సానుకూల నిర్ణయం వెలువడే పరిస్థితులు ఉన్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ఉద్యోగుల ముఖాల్లో సంతోషాలు కనిపించాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న డీఏల్లో కదలిక వచ్చి దీపావళికి ఓ శుభవార్త ఉండబోతున్నదని సమాచారం.
Also Read: Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటం
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం ముఖ్యమంత్రితో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నేరుగా ముఖ్యమంత్రి ముందే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు, బకాయి బిల్లులు, హెల్త్ కార్డులు, పీఆర్సీ, సీపీస్ రద్దు, 317 జీఓపై ప్రభుత్వంతో గట్టిగానే చర్చించారు. వాటిపై సమీక్ష చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే ప్రభుత్వం స్పందించకపోతే భారీ కార్యాచరణ చేపడతామని ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఉద్యోగులకు సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగుల ప్రెస్‌మీట్‌తో అర్థమవుతోంది.
Also Read: KTR: బరాబర్ జైలుకు పోతా.. రేవంత్ రెడ్డి అయ్యకు కూడా భయపడను
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కీలక విషయాలు తెలిపారు. 'ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మూడు గంటలపాటు ముఖ్యమంత్రి సమావేశమై చర్చించాం. మంత్రివర్గ ఉప సంఘం వేసి ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డీఏపై రేపు సాయంత్రం ఒక ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
'51 ఉద్యోగ సమస్యలపై రేవంత్ రెడ్డితో చర్చించాం. మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రేపు ఉప ముఖ్యమంత్రితో చర్చించి డిఏపై నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. రెండు డీఏలు ఇస్తారమని మాకు నమ్మకం ఉంది' అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.