హైదరాబాద్:  కరోనా వైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.  కరోనా వైరస్ను (Coronavirus) నివారించేందుకు అందరం ఒక్కటిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ప్రతీ కాలనీ అసోసియేషన్ లేదా అపార్ట్మెంట్ అసోసియేషన్‌కి ఇద్దరు సభ్యులతో కూడిన ఒక జట్టుని ఏర్పాటు చేసి ఆయా కాలనీలు, అపార్టుమెంట్లో నివసిస్తున్న అన్ని కుటుంబాల వద్దకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా కుటుంబసభ్యులు ఫ్లూ లక్షణాలతో బాధ పడుతున్నారా అనే వివరాలు అడిగి తెలుసుకోవాల్సిందిగా డీజీపి మహేందర్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఒకవేళ ఎవరైనా అలా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టుగా తెలిసినా, లేదా స్వయంగా మీ దృష్టికి వచ్చినా.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియ చేయాలని.. లేదా 100 నెంబర్‌కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. దయచేసి అందరు ఈ బాధ్యతను స్వీకరించాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసిన కేంద్రం


మీ కాలనీ, అపార్ట్మెంట్ వద్ద వ్యక్తుల అనవసర రాకపోకలను కట్టడి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య తెలంగాణగా మార్చే ప్రయత్నంలో, మాకు మీ పూర్తి సహకారం ఎంతో అవసరం. మీ సహకారం లేనిదే ఆరోగ్య తెలంగాణతో పాటు కరొనావైరస్‌పై విజయం సాధించడం సాధ్యం కాదని డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీ అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..