న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని (coronavirus spread) అరికట్టేందుకు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యూయేట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని (JEE) కేంద్రం వాయిదా వేసింది. తొలుత కేంద్రం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే నెల 3న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో మే చివరి వారం వరకు వాటిని వాయిదా వేస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వాయిదా పడిన పరీక్షల తేదీల (NEET, JEE exams new dates) వివరాలను వెల్లడించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. మే నెల 3న జరగాల్సి ఉన్న పరీక్షల కోసం ఇవాళ్టి నుంచి.. అంటే మార్చి 27 నుండి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ( NEET, JEE Admit cards download) చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు కేంద్రం ఆ పరీక్షలనే వాయిదా వేయడంతో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ సైతం నిలిచిపోయింది.
Read also : లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే
ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్ ముగిసిన అనంతరం మే నెల చివరి వారంలో పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు ఏప్రిల్ 15 తర్వాతే ఓ స్పష్టతకు రానున్నారు. ఏప్రిల్ 15 తర్వాత కేంద్రం తీసుకునే ఆ నిర్ణయం ప్రకారమే పరీక్షల అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందనేది తేలనుంది.
Read also: అల్లా ఇచ్చిండు.. నేను పంచుతున్నా.. 800 మందికి ఆహారం పంచుతున్న ముస్లిం
ఇదే విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా రమేష్ పోఖ్రియాల్ నిశాంఖ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. పరీక్షల సమయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పరీక్షా కేంద్రాల కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు కుదిరే పరిస్థితి కనిపించడం లేదు కనుక పరీక్షల నిర్వాహకులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (NTA) పరీక్షలు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరినట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా