Telangana DSC 2024 Key: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలయ్యింది. కొన్ని వారాల కిందట నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి కీ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 11,062 ఉపాధ్యాయ ఖాళీ భర్తీకి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జవాబు పత్రాల కీను విడుదల చేసింది. అంతేకాకుండా ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యా శాఖ సూచించింది. ఇక ప్రాథమిక కీపై ఏమైనా అభ్యర్థులు ఉంటే ఆన్‌లైన్‌ వేదికగా తెలపాలని పేర్కొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Independence Day: కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు


డీఎస్సీ పరీక్షలు ఇలా
రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల కోసం జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఈ పోస్టులకు మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షలు రాశారు. 34,694 మంది గైర్హాజరవగా.. హాజరైన అభ్యర్థుల శాతం 87.61 శాతంగా నమోదైంది. సీబీఆర్‌టీ పద్ధతిలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.

Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్‌ గాంధీని లాగిన కేటీఆర్‌


పోస్టుల వివరాలు ఇవే..
ఎస్జీటీలు 6,508
స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629
భాషా పండితులు 727
పీఈటీలు 182
ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796

ప్రభుత్వ వైఖరితో కొందరికి అన్యాయం
డీఎస్సీ పరీక్షల నిర్వహణపై తీవ్ర ఆందోళన కొనసాగిన విషయం తెలిసిందే. భారీగా సిలబస్‌ ఉండడం.. చదువుకోవడానికి సమయం లేకపోవడంతో అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌ వచ్చింది. వాయిదా వేయాలని అర్ధరాత్రిళ్లు.. కొన్ని వారాల పాటు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేశారు. అయినా కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వినిపించుకోకుండా పరీక్షలు యథావిధిగా నిర్వహించింది. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష సక్రమంగా రాయలేకపోయారు. కొందరు డీఎస్సీ పరీక్షలను బహిష్కరించారు. దీంతో కొన్ని వేల మంది ప్రభుత్వ వైఖరితో పరీక్షలు రాయలేకపోయారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter