TS Elections 2023: తెలంగాణలో విస్తృత తనిఖీలు, భారీగా డబ్బు, నగలు స్వాధీనం
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోదాలు ప్రారంభించడంతో అప్పుడే పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Elections 2023: దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసింది. కోడ్ ఇలా అమల్లోకి వచ్చిందో లేదో పోలీసుల సోదాలు పెరిగిపోయాయి. పోలీసుల సోదాల్లో 3 కోట్లకు పైగా నగదు స్వాధీనమైంది.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పోలీసులే కన్పిస్తున్నారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో అక్రమ డబ్బు సరఫరా, మద్యం పంపిణీ అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, నాకా బందీలతో సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు, బంగారం తరలిస్తుంటే తప్పకుండా అందుకు సంబంధించి ఆధారాలు చూపించాల్సి వస్తుంది. నగదు, నగలు వెంట తీసుకెళ్తుంటే అందుకు సంబంధించిన రసీదులు, బిల్లులు, పత్రాలు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. డబ్బు 50 వేలకు మించితే ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాహనాలు కాగితాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిపిన సోదాల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడింది. 3 కోట్లకు పైగా నగదు, 20 కిలోల బంగారం, 300 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు, నగలే కాకుండా వస్తువుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గౌచ్చిబౌలిలో పెద్దఎత్తున కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు భావించారు. అందుకే బల్క్ ఏం తీసుకెళ్తున్నా అందుకు సంబంధించిన పత్రాలు చూపిస్తే సరిపోతుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 న వెలువడనుంది. నవంబర్ 10 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన కాగా, నవంబర్ 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. నవంబర్ 30 పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3 జరిగే కౌంటింగ్ వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.
Also read: TS Elections 2023: నగదు ఉంటే పత్రాలు చూపించాల్సిందే.. అభ్యర్ధులు, ఓటర్లకు ఎన్నికల కమీషన్ సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook