TS Elections 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఛత్తీస్‌గఢ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకే విడతలో వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ మొత్తం నవంబర్ నెలలో జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నవంబర్ 3న నోటిటఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువుంటుంది. నవంబర్ 13 నామినేషన్ల పరిశీలన కాగా నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులు, ఓటర్లకు కీలకమైన సూచనలు జారీ చేశారు. ఇప్పటికీ ఓటు హక్కు లేనివాళ్లు అక్టోబర్ 31 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యలుంటే 1950 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డుల్ని ఉపయోగించవచ్చని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్లకు రవాణా సౌకర్యం ఉంటుందని, పోలింగ్ కేంద్రాల్లో బెయిలీ లిపిలో బ్యాలెట్ పత్రాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
ఇక అభ్యర్దులకు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో నాయకుల ఫోటోలు తొలగించాల్సి ఉంటుంది. ప్రకటనలకు ఎన్నికల కమీషన్ ముందస్తు అనుమతి ఉండాలి. ఎన్నికలు పురస్కరించుకుని రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై నిఘా ఉంటుందన్నారు. అఫిడవిట్లలో అన్ని కాలమ్స్ కచ్చితంగా నింపాలని లేనిపక్షంలో రిజెక్ట్ అవుతుందన్నారు. ఇక ఎప్పటిలానే రాత్రి 10 గంటల్నించి ఉదయం 6 గంటల వరకూ లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు.
ఎవరైనా నగదు వెంట తీసుకెళ్తుంటే దానికి సంబంధించిన పత్రాలు , వివరాలు తప్పకుండా ఉండాలన్నారు. బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్ధుల ఫోటోలు కూడా ఉంటాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అన్ని విషయాలు పరిగణలో తీసుకోవాలని పార్టీలకు, నేతలకు విజ్ఞప్తి చేశారు.
Also read: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 30 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook