Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కు కూడా కౌంట్ డౌన్ మెుదలైంది. ఇప్పటికే అధికారులు ఆ దిశగా కసరత్తు మెుదలుపెట్టారు. డిసెంబరు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో రాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది లోక్ పోల్ సంస్థ. ఈ ఫ్రీ-పోల్ సర్వే ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 30 వరకు చేశారు. ఇందులో ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఊరట కలిగేంచాలా ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కుతుందని సర్వే అంచనా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరెవరికి ఎన్ని సీట్లు?
తాజా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 61-67 ఎమ్మెల్యే స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 45-51 ఎమ్మెల్యే స్థానాలు, ఎంఐఎం పార్టీకి‌ 6-8 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు.. ఇతరులకు 0-1 ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి 41-44% ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి  39-42% ఓట్లు, బీజేపీకి  10-12% ఓట్లు, ఎంఐఎం 3-4%.. ఇతరులు 3%-5% ఓట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లోక్ పోల్ సర్వే వేసిన అంచనాలే నిజమయ్యాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 129-134 స్థానాలు, బీజేపీకి 59-65 స్థానాలు వస్థాయని తెలిపింది. 


కారణాలు ఇవే...!
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది లోక్ పోల్  పేర్కొంది. ఎన్నికల హామీలు అమలుచేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని సర్వే వెల్లడించింది. బీజీపీ తన ఓటు బ్యాంకును కోల్పోయినట్లు తెలిపింది. ఓల్డ్ సిటీలో ఎప్పటిలాగే ఎంఐఎం తన పట్టు నిలుపుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజల్లో ఆ పార్టీపై సానుకూల వైఖరిని పెంచిందని సర్వే పేర్కొంది. అంతేకాకుండా బీసీలు, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందని తెలిపింది. నిజామాబాద్, మెదక్ లోకసభ స్థానాల్లో  బీఆర్ఎస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటుందని.. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్, నల్గొండ, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. 



Also read: Telangana Elections: 22 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook