Telangana Elections: 22 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ

Telangana Voters List: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది. వృద్దులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 5, 2023, 03:59 PM IST
Telangana Elections: 22 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ

Telangana Voters List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూహుర్తం ముంచుకోస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అని.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రధాన్యత ఉందన్నారు. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం తాము కమిట్మెంట్‌తో పనిచేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయన్నారు. అక్రమ నగదు, మద్యంను కట్టడి చేయాలని, అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారని చెప్పారు.

"119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. 80 ఏళ్లకు పైబడిన వాళ్లు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. 22 లక్షల ఓట్లను డిలీట్ చేశాం. తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇస్యు ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ఈ సారి 8.11 లక్షల మొదటిసారి ఓటర్స్ ను నమోదు చేశాం. యువత-మహిళా ఓట్లను పెంచేందుకు మేమేంతో కృషి చేసి.. సక్సెస్ అయ్యాం. 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి.

థర్డ్ జెండర్స్‌తో సమావేశాలు పెట్టాము.. 35 వేల పీఎస్‌లు, ప్రతీ పీఎస్‌కు 897 మంది ఉన్నారు. మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. మొదటిసారి తెలంగాణలో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే cVigil యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు." రాజీవ్ కుమార్ తెలిపారు.

కేవైసీ అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు. బర్ర్‌ లో చెక్ పోస్టులు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీలపై ఈసీ నిఘా ఉంటుందని తెలిపారు. హెలిప్యాడ్స్, ఎయిర్ పోర్ట్స్‌లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించామన్నారు. ఆరోపణలు (ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రకటనలు-సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్వర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారని.. ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News