Telangana Elections: తెలంగాణలో ఏపాటి బలముందో లేదో తెలియదు గానీ జనసేన మాత్రం పోటీకు ఆసక్తి చూపిస్తోంది. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ పొత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకో ఎవరికి ప్రతికూలంగా ఉండేందుకోననే వాదనలు పక్కన పెడితే బీజేపీతో కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో జతచేరి బీజేపీ అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురైనట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో, తెలంగాణలో పొత్తుతో సయోధ్యకు ప్రయత్నిస్తోందా అనే ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదల్చుకోవడం లేదు. అందుకే జనసేనతో పొత్తుకు వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ పొత్తుకు సంబంధించి వివిధ రకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఏ పార్టీ ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోయినా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల లెక్కలు తేలాయనే ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతోంది.


తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తులో భాగంగా జనసేనకు 12 స్థానాలు కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ రెండవ జాబితాలో జనసేనకు కేటాయించే స్థానాలు ఉండవచ్చని సమాచారం. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లేందుకు బీజేపీ యోచిస్తోంది. ఈటెల రాజేందర్ ఈసారి హుజూరాబాద్, బద్వేల్ నుంచి పోటీ చేయవచ్చు.


అటు జనసేనకు కేటాయించే స్థానాల్లో కూకట్‌పల్లి, వైరా, అశ్వారావుపేట, కోదాడ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్ స్థానాలుంటాయని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మూడు, నల్గొండలో రెండు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానం కేటాయించవచ్చు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి..జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిసినప్పుడు ఈ పొత్తుల చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.


Also read: Telangana Elections 2023: తెలంగాణలో అధికారం ఎవరిది, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నమ్మశక్యం కాని ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook