Telangana Elections 2023: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అందరికంటే చివరిగా నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలున్నాయి. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ , బీజేపీలు యత్నిస్తున్నాయి. మరి ఓటరు ఎటున్నాడు, సర్వేలు ఏం చెబుతున్నాయి..
తెలంగాణ ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుుతన్నాయి. అభ్యర్ధుల జాబితాలు, ప్రచార పర్వంలో అధికార బీఆర్ఎస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ , బీజేపీలు నిమగ్నమయ్యాయి. హంగ్ వస్తోందని బీజేపీ భావిస్తుంటే అధికారం మాదేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా టుడే -సీ ఓటర్ సర్వే సర్వే ఆసక్తికర ఫలితాలను ప్రకటించింది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ లేదు.
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వివరాలు
మొత్తం 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 54 స్థానాలతో ముందంజలో ఉంటుంది. ఇక 2018 ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 49 స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో 1 స్థానానికే పరిమితమైన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెల్చుకోవచ్చు. ఇక ఇతరులు గత ఎన్నికల్లో 11 మంది గెలిస్తే ఈసారి 8 మంది గెలుస్తారని ఇండియా టుడే సీ ఓటర్ అంచనా వేస్తోంది. అంటే అందరూ ఊహిస్తున్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం 28 శాతం కాగా ఈసారి 11 శాతం పెరిగి 39 శాతానికి చేరుకుంది. ఇక గత ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ 9 శాతం ఓట్లు కోల్పోయి 38 శాతానికి పడిపోనుంది. బీజేపీ ఓటు శాతం ఈసారి భారీగా పెరగనుంది.
రాష్ట్రంలో అధికారం కోసం కావల్సిన మేజిక్ ఫిగర్ 119 కాగా, ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ వచ్చేలా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మేజిక్ ఫిగర్‌కు సమీపంలో నిలుస్తోంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్నందున ఈలోగా కాంగ్రెస్ మరింత బలపడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Rahul Gandhi Speech: తెలంగాణలో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. రాహుల్ గాంధీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook