Telangana: సోమేష్ కుమార్‌కు కీలక బాధ్యతలు, కేబినెట్ హోదాతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియామకం
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నారు.
Telangana: తెలంగాణ మాజీ ఛీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌కు కేబినెట్ హోదా దక్కింది. తన ముఖ్య సలహాదారుడిగా నియమించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మూడేళ్లపాటు సోమేష్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ హోదా సైతం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించిన ఆయనను ఏపీ కేడర్ అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారించడంతో హఠాత్తుగా ఇటీవలే ఏపీకు బదిలీ అయ్యారు. జనవరి 12వ తేదీ 2023లో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిశారు. ఆ తరువాత నెలరోజులైనా సోమేష్ కుమార్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇది కూడా సోమేష్ కుమార్ విజ్ఞప్తి మేరకే జరిగినట్టు తెలుస్తోంది. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఇప్పుుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. సోమేష్ కుమార్ తెలంగాణలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ఏపీ కేడర్ అని నిర్ధారించినా ఏపీకు వెళ్లడం ఇష్టం లేక తెలంగాణలోనే కొనసాగారు. చివరికి హైకోర్టు ఉత్తర్వులతో వైదొలగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన స్థానంలోనే ఇప్పుడు తెలంగాణలో శాంతి కుమారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుడిగా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి సోమేష్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకూ పదవీ కాలముంది. కానీ ఏపీలో చేయడం ఇష్టం లేక రిపోర్ట్ చేసిన నెలరోజులకే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా కేబినెట్ హోదాతో పనిచేయనున్నారు.
Also read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. కాసేపటికే విద్యార్థి దారుణ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook