Tax Exemptions in Telangana | దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా రాష్ట్రంలో ఆస్తిపన్నులలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీ వర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమాచారం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి


తెరాస ( TRS ) పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు


ఒకవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊరటగా 50% ఆస్తి పన్ను రాయితీ ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అని పోస్ట్ చేశారు.



2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో (GHMC ) రూ.15వేల వరకు ఆస్తిపన్ను ఉన్నవారికి 50 శాతం మేరా రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో ఉన్న రూ.10 వేల పన్ను ఉన్నవారికి 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి వచ్చే సంవత్సరం సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల మంది లబ్ది చేకూరుతుంది. 



Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే



మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR