Global e-Tenders: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఆ టెండర్ వివరాలిలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వ్యాక్సినేషన్ కొరత (Vaccine Shortage) తీవ్రంగా ఉంది. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వలేకపోతోంది. దేశంలో ప్రస్తుతం రెండే వ్యాక్సిన్‌లతో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతోంది. మూడ్రోజుల్నించి రష్యాకు చెందిన స్పుట్నిక్ వి వ్యాక్సిన్(Sputnik v vaccine) అందుబాటులో వచ్చింది. అయితే వ్యాక్సిన్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేశారు. 18-45 ఏళ్ల వయస్సువారికైతే అసలు వ్యాక్సినేషన్ ప్రారంభమే కాలేదు. మరోవైపు ఇటీవల తొలిడోసు వ్యాక్సిన్ నిలిపివేసిన పరిస్థితి. అందుకే ఏపీ ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కూడా గ్లోబల్ ఈ టెండర్లను(Global e Tenders) ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌళిక వసతుల సంస్థ ( TSMIDC)ద్వారా కోటి వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ఈ టెండర్లు ఆహ్వానించింది.


నెలకు కనీసం 15 లక్షల వ్యాక్సిన్‌లు సరఫరా చేయాలని..ఆరు నెలల్లోగా కోటి డోసులు పూర్తిగా ఇవ్వాలని టెండర్ నిబంధనల్లో ఉంది. టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకూ అవకాశం కల్పించింది.ఈ మేరకు ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 


Also read: TSPSC Chariman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి జనార్దన్ రెడ్డి నియామకం, నూతన సభ్యులు వీరే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook